విజయవాడ, 15 జనవరి (హి.స.)
తిరుపతి: సంక్రాంతి పండుగ ( నేపథ్యంలో తిరుమల ()లో భక్తుల ( రద్దీ ( కొనసాగుతోంది. శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారా దర్శనం కొనసాగుతోంది. భక్తులు క్యూ లైన్లలో నిలుచుని స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులుఏర్పాట్లు చేశారు. కాగా ఈ నెల 19వ తేది వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. మరోవైపు తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టోకేన్ల జారీ కొనసాగుతోంది. 17వ తేదీకి సంబంధించిన దర్శన టోకెన్లను బుధవారం భక్తులకు టీటీడీ అధికారులు జారి చేశారు. కాగా ఐదు రోజుల్లో మూడు లక్షల 37 వేల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల