కర్ణాటక, 23 జనవరి (హి.స.)
గత కొన్ని నెలలుగా కర్ణాటక రాజకీయాల్లో దుమారం రేపిన ముడా హౌసింగ్ స్కాంలో సీఎం సిద్ధరామయ్యకు భారీ ఊరట లభించింది. ఈ కేసు విచారణ జరుపుతున్న లోకాయుక్త కోర్టు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు నేడు క్లీన్ చిట్ ఇచ్చింది. ఆయనపై వచ్చిన ఆరోపణల్లో పసలేదని తేల్చింది. ముఖ్యమంత్రి అక్రమాలకు పాల్పడినట్టు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. అంతేకాదు, ఈ వ్యవహారంలో సిద్ధరామయ్య భార్యకు కూడా ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఇక లోకాయుక్త కోర్టు జరిపిన విచారణ నివేదికను సోమవారం నాడు కర్ణాటక హైకోర్టుకు సమర్పించనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..