ఏపీ  సీఎం చంద్రబాబు.నేడు. కేంద్ర.ఆర్ధికంసఖ.మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ
దిల్లీ: 24 జనవరి (హి.స.), ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో శుక్రవారం భేటీ కానున్నారు. దావోస్‌ ప్రపంచ ఆర్థికవేదిక సదస్సు పర్యటన నుంచి ఆయన నేరుగా దిల్లీ చేరుకుంటారు. ఉదయం 11 గంటలకు ఇక్కడి నార్త్‌బ్లాక్‌లోని ఆర్థికశాఖ క
 ఏపీ  సీఎం చంద్రబాబు.నేడు. కేంద్ర.ఆర్ధికంసఖ.మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ


దిల్లీ: 24 జనవరి (హి.స.), ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో శుక్రవారం భేటీ కానున్నారు. దావోస్‌ ప్రపంచ ఆర్థికవేదిక సదస్సు పర్యటన నుంచి ఆయన నేరుగా దిల్లీ చేరుకుంటారు. ఉదయం 11 గంటలకు ఇక్కడి నార్త్‌బ్లాక్‌లోని ఆర్థికశాఖ కార్యాలయంలో నిర్మలా సీతారామన్‌తో సమావేశమవుతారు. ఫిబ్రవరి 1న కేంద్రప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న తరుణంలో రాష్ట్రం తరఫున విజ్ఞప్తులను ఆమె ముందుంచే సూచనలు కనిపిస్తున్నాయి. వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ అమలు, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి సీఎం ప్రస్తావించే అవకాశం ఉంది. అమరావతి నిర్మాణానికి ప్రపంచబ్యాంకు, ఏడీబీ అందించే నిధుల అంశమూ చర్చకు రావొచ్చు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి.. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అవుతారు. కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్, పునరుత్పాదక ఇంధనశాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషీలనూ కలిసే అవకాశం ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande