తెలంగాణ, 4 జనవరి (హి.స.) త్వరలో జరగబోయే ఢిల్లీ
అసెంబ్లీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ తొలి జాబితాను రిలీజ్ చేసింది. ఈ ఫస్ట్ లిస్టులో 29 మంది పేర్లను ప్రకటించింది. ఆప్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద కేజీవాల్పై బీజేపీ తరపున పర్వేష్ వర్మ పోటీ చేయబోతుండగా.. అలాగే, ప్రస్తుత సీఎం అతిషిపై పోటీకి రమేష్ బిదురిని కమలం పార్టీ రంగంలోకి దింపబోతోంది. ఇక, ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సన్దేవ్ ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటూ అనేక ఊహాగానాలు తెర పైకి వచ్చాయి. దీంతో తొలి జాబితాలో ఆయన పేరు కనిపించకపోవడం గమనార్హం. కాగా, తొలి జాబితాలో ఇద్దరు మహిళలకు చోటు దక్కగా.. అందులో ఢిల్లీ యూనివర్సిటీ ఉద్యమ నేత రేఖా గుప్తా, సుశ్రీ కుమారి రింకూలకు భారతీయ జనతా పార్టీ తొలి జాబితాతో ఛాన్స్ ఇచ్చింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్