కేర‌ళ‌లో లోయ‌లో ప‌డ్డ బ‌స్సు – ఇద్ద‌రు మ‌హిళ‌ల‌తో స‌హా న‌లుగురు మృతి
ఇడుక్కి, 6 జనవరి (హి.స.) కేరళ ఇడుక్కిలో ఆర్టీసీ బస్సు లోయలో పడిన ప్ర‌మాదంలో ఇద్దరు మహిళలు సహా నలుగురు మృతిచెందారు. 23మంది గాయ‌ప‌డ్డారు.. విహారయాత్రకు వెళ్లి తిరిగివస్తుండగా సోమవారం ఉదయం ఇడుక్కిలోని పుల్లుపార వద్ద ఈ ప్రమాదం జ‌రిగింది.. ప్రమాద సమయంలో
కేరళ బస్సు ప్రమాదం


ఇడుక్కి, 6 జనవరి (హి.స.)

కేరళ ఇడుక్కిలో ఆర్టీసీ బస్సు లోయలో పడిన ప్ర‌మాదంలో ఇద్దరు మహిళలు సహా నలుగురు మృతిచెందారు. 23మంది గాయ‌ప‌డ్డారు.. విహారయాత్రకు వెళ్లి తిరిగివస్తుండగా సోమవారం ఉదయం ఇడుక్కిలోని పుల్లుపార వద్ద ఈ ప్రమాదం జ‌రిగింది.. ప్రమాద సమయంలో బస్సులో 34మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనేఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయ‌ప‌డిన వారిని చికిత్స కోసం స‌మీపంలోని హాస్ప‌ట‌ల్ కు త‌ర‌లించారు..మృతులను అరుణ్ హరి, రమా మోహన్, బిందు నారాయణన్, సంగీత్ లుగా గుర్తించారు. మృతుల బంధువుల‌కు స‌మ‌చారాన్ని అందించారు పోలీసులు..

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande