ముంబై, 7 జనవరి (హి.స.)గత వారం ముగింపులో స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది. ఈ వారం ప్రారంభంలో కూడా అదే విధానం కొనసాగింది. ఇక కొత్త వైరస్ ప్రభావం, అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న మిశ్రమ సంకేతాల కారణంగా సోమవారం భారీ నష్టాలను చవిచూసింది. ఏకంగా రూ.12 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. మంగళవారం కూడా అదే ప్రభావం ఉంటుందని మార్కెట్ వర్గాలు భావించాయి గానీ.. అందుకు భిన్నంగా ఉదయం నుంచి సూచీలు లాభాలతో ట్రేడ్ అయ్యాయి. సెన్సెక్స్ 234 పాయింట్లు లాభపడి 78, 199 దగ్గర ముగియగా.. నిఫ్టీ 91 పాయింట్లు లాభపడి 23, 707 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్తో పోలిస్తే రూ.85.72 దగ్గర ముగిసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..