తెలంగాణ, 8 జనవరి (హి.స.)
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో
ఢిల్లీ పాలిటిక్స్ హీటెక్కాయి. ఆప్, బీజేపీ పరస్పర విమర్శలకు దిగాయి. ఈ సమయంలో ' ముఖ్యమంత్రి బంగ్లా' వివాదం రాజకీయ దుమారానికి దారి తీసింది. ఈ బంగ్లాను 'శీష్ మహల్ అంటూ భారతీయ జనతా పార్టీ చేస్తోన్న విమర్శలను ఆమ్ ఆద్మీ పార్టీ తిప్పికొడుతుంది. తాజాగా 'నిజాన్ని చూపిస్తామంటూ' ఆ పార్టీ నేతలు సంజయ్ సింగ్, సౌరభ్ భరద్వాజ్ మీడియాను తీసుకొని సీఎం అధికారిక నివాసం దగ్గరకు వెళ్లారు. అయితే వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకోవడంతో.. మంత్రి, ఎంపీ అధికారాలను పోలీసులు అడ్డుకుంటున్నారని ఆప్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో ముఖ్యమంత్రి నివాసం దగ్గర గందరగోళ వాతావరణం ఏర్పడింది.
కాగా, ఆ అధికారిక నివాసంలోకి వెళ్లేందుకు ఆమ్ ఆద్మీ నేతలకు పర్మిషన్ లేదని పోలీసులు తెలిపారు. వివాదం చెలరేగడంతో బారికేడ్లను ఏర్పాటు చేశారు పోలీసులు. ఎవరినీ లోపలికి అనుమతించ వద్దంటూ పైనుంచి ఆదేశాలు వచ్చాయని వెల్లడించారు. పోలీసుల చర్యలు బీజేపీకి సంతోషాన్ని కలిగిస్తున్నాయని మంత్రి సౌరభ్ భరద్వాజ్ విమర్శించారు. తర్వాత ఎంపీ సంజయ్ సింగ్తో పాటు కొద్దిసేపు ధర్నా చేసిన తర్వాత ప్రధాన మంత్రి అధికారిక నివాసం వైపు వెళ్లారు. దీంతో వారిని పీఎం నివాసం సమీపంలోనే పోలీసులు అడ్డుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..