అలీఘర్ , 9 జనవరి (హి.స.)ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లోని పురాతన దేవాలయాల స్థలంలో జామా మసీదు నిర్మించారంటూ ఆర్టీఐ కార్యకర్త కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నగరంలోని జామా మసీదును బౌద్ధ, జైన, హిందూ దేవాలయాలు ఉన్నచోటే నిర్మించారని ఆరోపిస్తూ ఆర్టీఐ కార్యకర్త అలీఘర్‌లోని సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలీఘర్ మునిసిపల్ కార్పొరేషన్‌తో సహా వివిధ ప్రభుత్వ విభాగాలతో సమాచార హక్కు చట్టంలోని నిబంధనల ప్రకారం.. సేకరించిన సమాచారం మేరకు ఆర్టీఐ కార్యకర్త పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఆర్టీఐ కార్యకర్త పిటిషన్‌ను న్యాయస్థానం స్వీకరించింది. ఈ కేసును ఫిబ్రవరి 15న విచారణకు స్వీకరిస్తామని సివిల్ జడ్జి గజేంద్ర సింగ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పిటిషనర్, ఆర్టీఐ కార్యకర్త పండిట్ కేశవ్ దేవ్ గౌతమ్ మీడియాతో మాట్లాడుతూ.. చారిత్రాత్మక రికార్డుల ప్రకారం.. 18వ శతాబ్దం ప్రారంభంలో నిర్మించబడిన జామా మసీదు మూలాల గురించి అనేక ప్రభుత్వ శాఖల నుంచి వివరాలు సేకరించిన తర్వాతే పిటిషన్ దాఖలు చేసినట్లు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు