తెలంగాణ/ఏ.పీ, 9 జనవరి (హి.స.)
ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో జరుగుతున్న 18వ ప్రవాసీ భారతీయ దివస్ సందర్భంగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ప్రవాసీ భారతీయ ఎక్స్‌ప్రెస్ రైలును గురువారం జెండా ఊపి వర్చువల్‌గా ప్రారంభించారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచి రైలు బయలుదేరింది. 3 వారాల పాటు ప్రయాణం చేయనున్న ప్రవాస భారతీయ ఎక్స్‌ప్రెస్ రైలు.. దేశంలోని పలు సంప్రదాయ, మతపరమైన ప్రదేశాలను.. విదేశాల్లో ఉండే భారతీయులకు చూపించి వస్తుంది.ఎన్ఆర్ఐ టూరిస్టుల కోసం ఈ రైలును రూపొందించారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచి బయల్దేరిన ఈ రైలు.. ఆ తర్వాత అయోధ్యకు చేరుకుంటుంది. అక్కడ నుంచి పాట్నా, గయా, వారణాసి, మహాబలిపురం, రామేశ్వరం, మధురై, కొచ్చి, గోవా, ఎక్తా నగర్(కేవడియా), అజ్మీర్, పుష్కర్, ఆగ్రా పట్టణాలను రైలు చుట్టివస్తుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇందులో 156 మంది ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది.
వివిధ దేశాల్లో ఉన్న భారతీయ ఎంబసీల నుంచి ఈ ప్రవాసీ భారతీయ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణించేందుకు ప్రయాణికులు దరఖాస్తు చేశారు. ఈ రైలు టూర్‌కు సంబంధించిన అన్ని ఖర్చులను కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఆయా దేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రవాస భారతీయుల విమాన ఖర్చులో 90 శాతం కూడా ప్రభుత్వం చెల్లించనుంది. వారు కేవలం 10 శాతం ఛార్జీ మాత్రమే భరించాల్సి ఉంటుంది. ఈ రైలులో ప్రయాణించే వారికి 4 స్టార్ హోటల్‌లో బస కల్పించనున్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..