ముంబయి:, 9 జనవరి (హి.స.) దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock market) గురువారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో మిశ్రమ సంకేతాల నడుమ తొలుత ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ను మొదలుపెట్టిన సూచీలు కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. కార్పొరేట్ సంస్థల త్రైమాసిక ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో, మదుపర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 259 పాయింట్లు తగ్గి 77,915 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 69 పాయింట్లు కుంగి 23,619 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో ఎల్‌అండ్‌టీ, ఎస్‌బీఐ, జొమాటో, టాటా స్టీల్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎంఅండ్‌ఎం, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో కదలాడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 76.12 డాలర్ల వద్ద, బంగారం ఔన్సు 2,678.40 వద్ద ట్రేడవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 85.92 వద్ద కొనసాగుతోంది.
5
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు