హైదరాబాద్, 7 జనవరి (హి.స.)
పొరుగుదేశం నేపాల్ను భూకంపం వణికించింది. మంగళవారం ఉదయం టిబెట్ లో భారీ భూకంపం సంభవించడంతో 53 మంది చనిపోయారు. మరో 62 మంది గాయపడ్డారు. నేపాల్- టిబెట్టు సరిహద్దులో భూమి పలుమార్లు కంపించింది. ఉదయం 6.35 గంటలకు రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.1గా నమోదైంది. ఉదయం 7.02 గంటలకు 10 కిలోమీటర్ల లోతులో 4.7 తీవ్రతతో రెండో భూకంపం, 30 కిలోమీటర్ల లోతులో 7.07 గంటలకు 4.9 తీవ్రతతో మూడోసారి భూమి కంపించింది. ఆ తర్వాత ఉదయం 9.05 గంటలకు రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీంతో మృతుల సంఖ్య భారీగా పెరిగింది.
టిబెట్ లో కొన్ని క్షణాల పాటు ప్రకంపనలు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే, మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..