వారం రోజుల్లో కుంభమేళా ప్రారంభం కానుండగా.. తెరపైకి కొత్త వివాదం..
హైదరాబాద్, 6 జనవరి (హి.స.) వారం రోజుల్లో కుంభమేళా ప్రారంభం కానుండగా.. కొత్త వివాదం తెరపైకి వచ్చింది. కుంభమేళా జరుగుతోన్న ప్రదేశం వక్ఫ్ బోర్డుకు చెందిందని ప్రయాగ్‌రాజ్‌లోని ముస్లింలు సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, అఖాడాలు ఏర్పాటుచేసిన స్థలం కూడా త
కుంభమేళ


హైదరాబాద్, 6 జనవరి (హి.స.)

వారం రోజుల్లో కుంభమేళా ప్రారంభం కానుండగా.. కొత్త వివాదం తెరపైకి వచ్చింది. కుంభమేళా జరుగుతోన్న ప్రదేశం వక్ఫ్ బోర్డుకు చెందిందని ప్రయాగ్‌రాజ్‌లోని ముస్లింలు సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, అఖాడాలు ఏర్పాటుచేసిన స్థలం కూడా తమదేనని వాదిస్తున్నారు.ముస్లింల వాదనల ప్రకారం 54 బిఘాలు (దాదాపు 34 ఎకరాలు) భూమి వక్ఫ్ బోర్డుకు చెందుతుంది. ఆ భూమిలో ముస్లింల ప్రవేశాన్ని నిరోధించలేమని, అది వారికే చెందుతుందని బోర్డు గట్టిగా చెప్పింది. అఖిల భారత ముస్లిం జమాత్‌ అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్‌ రజ్వీ బరేల్వీ మాట్లాడుతూ... వక్ఫ్‌ స్థలంలో ఇంతటి ఉత్సవం నిర్వహించేందుకు ముస్లింలు అనుమతించి తమ విశాల హృదయాన్ని చాటుకున్నారని అన్నారు... హిందువులు కూడా ఇచ్చిపుచ్చుకునే రీతిలో ఈ కార్యక్రమానికి తమను అనుమతించాలని ఆయన కోరారు

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande