వెనకబడిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను గత ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోలేదు.. ప్రధాని మోదీ
హైదరాబాద్, 4 జనవరి (హి.స.) దేశ అభివృద్ధికి గ్రామాలే పట్టుకొమ్మలని అయితే అటువంటి.గ్రామాల అభివృద్ధిని గత ప్రభుత్వాలు విస్మరించాయ‌ని ధ్వ‌జ‌మెత్తారు ప్ర‌ధాని మోదీ.. త‌మ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌లు ప‌థ‌కాల‌తో గ్రామీణ భారతంలో పేదరికం తగ్గిందన్నారు. ఢి
ప్రధాని మోది


హైదరాబాద్, 4 జనవరి (హి.స.)

దేశ అభివృద్ధికి గ్రామాలే పట్టుకొమ్మలని అయితే అటువంటి.గ్రామాల అభివృద్ధిని గత ప్రభుత్వాలు విస్మరించాయ‌ని ధ్వ‌జ‌మెత్తారు ప్ర‌ధాని మోదీ.. త‌మ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌లు ప‌థ‌కాల‌తో గ్రామీణ భారతంలో పేదరికం తగ్గిందన్నారు. ఢిల్లీలో నేడు నిర్వహించిన గ్రామీణ భారత మహోత్సవం 2025 కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మాట్లాడుతూ, వెనకబడిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను గత ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. దాంతో గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు పెరిగాయన్నారు. ఫలితంగా పట్టణాల్లోనూ పేదరికం పెరిగిపోయిందన్నారు. సమాజంలో ఎన్నో మార్పులు వస్తున్నా గ్రామాలకు, పట్టణాలకు మధ్య గ్యాప్ పెరుగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande