ముంబయి: 04 జనవరి (హి.స.)ప్రముఖ అణు శాస్త్రవేత్త డాక్టర్ రాజగోపాల చిదంబరం (88) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ముంబయిలోని జస్‌లోక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. పోఖ్రాన్ న్యూక్లియర్ పరీక్షల్లో ఆయన (Nuclear scientist Dr Rajagopala Chidambaram) కీలక పాత్ర పోషించారు.
చెన్నైలో జన్మించిన రాజగోపాల చిదంబరం.. మద్రాస్ యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్‌తో బీఎస్సీ పూర్తి చేశారు. 1962లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి పీహెచ్‌డీ సాధించారు. 1975లో జరిపిన పోఖ్రాన్ 1, 1998లో నిర్వహించిన పోఖ్రాన్ 2 అణు పరీక్షల్లో కీలకంగా పనిచేశారు. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) డైరెక్టర్‌గా వ్యవహరించిన రాజగోపాల చిదంబరం.. అణుశక్తి కమిషన్‌కు ఛైర్మన్‌గానూ సేవలందించారు. అణుశక్తి విభాగం కార్యదర్శిగా, భారత ప్రభుత్వానికి శాస్త్రీయ సలహాదారుగా పనిచేశారు. ఆయన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం 1975లో పద్మశ్రీ, 1999లో పద్మవిభూషణ్ పురస్కారాలతో సత్కరించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు