ముంబై, 23 అక్టోబర్ (హి.స.)గోల్డ్ ర్యాలీకి బ్రేకులు పడ్డాయి. బంగారం ధర అత్యంత భారీగా పెరిగి.. ఇప్పుడు పడుతూ వస్తోంది. రెండ్రోజుల్లో బంగారం ధర భారీగానే తగ్గుముఖం పట్టింది. మన దగ్గరైతే పది గ్రాముల ధర 5వేల వరకు పడిపోవడంతో.. జనం ఊపిరిపీల్చుకుంటున్నారు. ఈ ధర ఇంకాపడే అవకాశాలున్నట్లు మార్కెట్ పండిట్స్ విశ్లేషిస్తున్నారు.
భగ్గున మండిన బంగారం ధరలు.. ఇప్పుడు చల్లబడుతున్నాయి. ఇన్నాళ్లూ ఆకాశమే హద్దుగా పెరుగుతూ పోయిన గోల్డ్ రేట్లు.. కంప్లీట్ యూటర్న్ తీసుకున్నాయి. ఒక్కరోజులో 9వేలు పడిపోవడంతో.. బులియన్ మార్కెట్లో కాస్తంత రిలీఫ్ కనిపిస్తోంది. ఈనెల 16న 24 క్యారెట్ల తులం బంగారం లక్షా 36వేల ధర పలికింది. ఇక లక్షన్నరే టార్గెట్‌గా పసిడి పరుగులు తీస్తుందని అంతా భావించారు
ప్రస్తుతం హైదరాబాద్‌లో బంగారం ధర లక్షా 25వేల 880కి చేరింది. ఇక కిలో వెండి ధర.. లక్షా 74వేల 900కి చేరింది. వెండి ఒకానొక దశలో లక్షా 88వేలకు చేరుకుని.. ఇప్పుడు పదిహేను వేల వరకు దిగివచ్చింది. మరికొన్ని రోజుల్లో బంగారం ధరలు ఇంకా పడిపోయే అవకాశాలున్నాయి. దీనికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ట్రంప్ పేల్చిన బాంబుతో బంగారం పడిపోతోంది. చైనాతో ఇన్నిరోజులు కయ్యం పెట్టుకున్న ట్రంప్.. ఇప్పుడు ఆ దేశంపై సుంకాలు ఎక్కువ రోజులు కొనసాగవని సంకేతాలు ఇవ్వడంతో బంగారం తగ్గుతున్నట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
22 క్యారెట్ల బంగారం
చెన్నై – రూ. 1,15,390
బెంగళూరు – రూ. 1,15,390
ఢిల్లీ – రూ. 1,15,540
కోల్‌కతా – రూ. 1,15,390
ముంబై – రూ. 1,15,390
హైదరాబాద్ – రూ. 1,15,390
24 క్యారెట్ల బంగారం
చెన్నై – రూ. 1,25,880
బెంగళూరు – రూ. 1,25,880
ఢిల్లీ – రూ. 1,26,030
కోల్‌కతా – రూ. 1,25,880
ముంబై – రూ. 1,25,880
హైదరాబాద్ – రూ. 1,25,880
వెండి ధరలు ఇలా
చెన్నై – రూ. 1,59,900
బెంగళూరు – రూ. 1,63,800
ఢిల్లీ – రూ. 1,59,900
కోల్‌కతా – రూ. 1,59,900
ముంబై – రూ. 1,59,900
హైదరాబాద్ – రూ. 1,74,900
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV