రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం. తండ్రి కళ్ల ముందే ఇద్దరు చిన్నారులు మృతి
రంగారెడ్డి, 23 అక్టోబర్ (హి.స.) ట్రాక్టర్, ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలోని తమ్మలోని గూడ గేటు వద్ద గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కడ్తాల్ మండలం ముద్విన్
ఇద్దరు చిన్నారుల మృతి


రంగారెడ్డి, 23 అక్టోబర్ (హి.స.) ట్రాక్టర్, ద్విచక్ర వాహనం ఢీకొనడంతో

ఇద్దరు చిన్నారులు మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలోని తమ్మలోని గూడ గేటు వద్ద గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కడ్తాల్ మండలం ముద్విన్ గ్రామానికి చెందిన తలతి అభిరామ్, (9) ఆర్తి రామ, (5) ఇద్దరు చిన్నారులు తమ తండ్రి ద్విచక్ర వాహనం పై మాల్ వైపు వెళుతున్నారు. ఈ క్రమంలోనే ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్ ఢీ కొనడంతో ఇద్దరు చిన్నారులు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande