భారత్‌లో అమెరికా నూతన రాయబారిగా సెర్గియో గోర్‌
అమరావతి, 8 అక్టోబర్ (హి.స.)body{font-family:Arial,sans-serif;font-size:10pt;}body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;} ఢిల్లీ, 08 అక్టోబర్ (హి.స.) .cf0{font-weight:bol
భారత్‌లో అమెరికా నూతన రాయబారిగా సెర్గియో గోర్‌


అమరావతి, 8 అక్టోబర్ (హి.స.)body{font-family:Arial,sans-serif;font-size:10pt;}body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;} ఢిల్లీ, 08 అక్టోబర్ (హి.స.) .cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}

భారత్‌లో అమెరికా నూతన రాయబారిగా సెర్గియో గోర్‌ ను నియమిస్తున్నట్లు ఇటీవల అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నియామకానికి తాజాగా సెనెట్ ఆమోదముద్ర పడింది. ఆయన భారత్‌లోనే గాకుండా దక్షిణ, మధ్య ఆసియాకు ప్రత్యేక రాయబారిగా విధులు నిర్వహించనున్నారు. ప్రస్తుతం యూఎస్ ప్రభుత్వం షట్‌డౌన్‌ను ఎదుర్కొంటోన్న తరుణంలో సెనెట్ నుంచి ఈ ఆమోదం లభించింది.

ఇంతకాలం వైట్‌హౌస్‌లో పర్సనల్‌ డైరెక్టర్‌గా కొనసాగిన 38 ఏళ్ల సెర్గియో.. ట్రంప్‌నకు వీర విధేయుడు. అందుకే అతితక్కువ కాలంలోనే ఆయన ట్రంప్‌ పరిపాలన విభాగంలో స్థానం సంపాదించగలిగారు. అత్యంత వివాదాస్పదమైన వ్యక్తుల్లో ఒకరైన సెర్గియో గోర్‌ (sergio Gor)ను భారత్‌ అమెరికా రాయబారిగా, దక్షిణ, మధ్యఆసియాలో పర్యవేక్షకుడిగా నియమించడం దౌత్యవర్గాలను షాక్‌కు గురిచేసింది. గోర్‌ నియామకంపై భారత్‌లో మిశ్రమ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande