body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}
దిల్లీ, పట్నా 08 అక్టోబర్ (హి.స.) : బిహార్‌లో శాసనసభ ఎన్నికల కోలాహలం మొదలైంది. తొలిదశ సమరం వచ్చేనెల ఆరునే జరగనుండటంతో అభ్యర్థుల ఎంపిక, పొత్తులపై పార్టీలు దృష్టిసారించాయి. కాంగ్రెస్ పార్టీ ‘కేంద్ర ఎన్నికల కమిటీ’ ఆదివారం దిల్లీలో సమావేశమై అభ్యర్థుల్ని ఎంపిక చేయనుంది. ఒకపక్క ఆర్జేడీ, వామపక్షాలతో సీట్ల సర్దుబాటుపై చర్చలు సాగిస్తూనే మరోపక్క అధిష్ఠానం తమ సొంత జాబితాను తయారు చేసుకుంటోంది. ఎంపికను సత్వరం పూర్తిచేయడమే దీని ఉద్దేశమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం 243 స్థానాల్లో ఎన్డీయేలోని ఇతర పక్షాలకు కేటాయించగా మిగిలిన సీట్లను చెరిసగం పంచుకోవాలని భాజపా, జేడీయూ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఎల్‌జేపీకి 25, హెచ్‌ఏఎంకు ఏడు, ఆర్‌ఎల్‌ఎంకు ఆరు చొప్పున ఇచ్చేందుకు భాజపా సిద్ధమైందని సమాచారం. ఎల్‌జేపీ అంగీకరించే స్థానాల సంఖ్య ఆధారంగా ఇతరులకు కోత పడే అవకాశం ఉంది.
ప్రత్యేక ముమ్మర సవరణ (ఎస్‌ఐఆర్)పై ఓ వార్తాపత్రికలో ప్రచురితమైన విశ్లేషణను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేశ్ ‘ఎక్స్’లో పంచుకున్నారు. సామూహిక హక్కుల రద్దు భయాలు సుప్రీంకోర్టు జోక్యంతో తొలగిపోయినప్పటికీ, ఆ ప్రక్రియలో కచ్చితత్వం, సంపూర్ణవతివంటి, సమానత్వం, పారదర్శకత, న్యాయబద్ధ దృక్కోణంపై అనుమానాలు మాత్రం మిగిలిపోయాయని ఈ విశ్లేషణ తెలిపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ