మినిస్టర్లలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కరప్షన్ చేయడంలో నెంబర్ వన్: ఎంపీ ధర్మపురి అరవింద్
జగిత్యాల, 11 నవంబర్ (హి.స.) తెలంగాణ క్యాబినెట్ మినిస్టర్లలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కరప్షన్ చేయడంలో నెంబర్ 1 అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. జిల్లా అభివృద్ధిపై నిర్వహించే దిశ కమిటీ మీటింగ్లో పాల్గొనేందుకు మంగళవారం జగ
ఎంపీ ధర్మపురి అరవింద్


జగిత్యాల, 11 నవంబర్ (హి.స.)

తెలంగాణ క్యాబినెట్ మినిస్టర్లలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కరప్షన్ చేయడంలో నెంబర్ 1 అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. జిల్లా అభివృద్ధిపై నిర్వహించే దిశ కమిటీ మీటింగ్లో పాల్గొనేందుకు మంగళవారం జగిత్యాలకు వచ్చిన ఎంపీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. క్యాబినెట్లో ఉత్తమ్ కుమార్ చేసినంత కరప్షన్ ఎవరు చేయరు అంటూ విమర్శించారు. జగిత్యాలకు మంజూరైన కేంద్రీయ విద్యాలయానికి ఇరిగేషన్ శాఖకు సంబంధించిన భూమిని ఎందుకు అలాట్ చేయడం లేదని ప్రశ్నించారు. భూమి కేటాయించేందుకు కూడా ఆయనకు వాటాలు కావాలేమో అంటూ ఎద్దేవా చేశారు.

మరోవైపు పేదలకు ఇస్తున్న రేషన్ బియ్యంలో సింహాభాగం కేంద్రం ఇస్తున్నవేనని కిలో బియ్యానికి 32 రూపాయలకు కేంద్రం ఇస్తే 3 రూపాయలు రాష్ట్రం ఇస్తుందన్నారు. అలాంటప్పుడు మోడీ ఫోటో పెట్టడానికి ఉన్న అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. ఇదే విషయమై కలెక్టర్ను ప్రశ్నిస్తే ఆయన కూడా నీళ్లు నమ్ములుతున్నారని అన్నారు. కేంద్రం ఇస్తున్న బియ్యం పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సంచులు ప్రింట్ చేసుకొని సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలు వేసుకున్నారన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande