తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల క్షేత్రంలో ప్రస్తుతం శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతుండటంతోభక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది.
ttd


తిరుమల, 23 సెప్టెంబర్ (హి.స.)తిరుమల క్షేత్రంలో ప్రస్తుతం శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతుండటంతోభక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది.. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కాంపార్ట్మెంట్లలో నిరీక్షించే అవసరం లేకుండా, భక్తులను నేరుగా డైరెక్ట్ లైన్ ద్వారా దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ క్రమంలో టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు శ్రీవారి దర్శనానికి సుమారు 4 నుండి 6 గంటల సమయం పడుతుండగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం పొందిన భక్తులకు 1 నుండి 2 గంటల వ్యవధిలోనే దర్శనం పూర్తవుతోంది. గడిచిన 24 గంటల కాలంలో తిరుమల శ్రీవారిని మొత్తం 82,198 మంది భక్తులు దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.

అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాలు బారులు తీరాయి. దీంతో రుయా ఆస్పత్రి కూడలి నుంచి ఇస్కాన్ ఆలయం మీదుగా బస్టాండ్కు వాహనాలను మళ్లించారు. గరుడ కూడలి మీదుగా వెళ్లాల్సిన వాహనాలను అన్నారావు కూడలి బస్టాండ్కు మళ్లించారు.భక్తిప్రపత్తులతో స్వామివారికి తమ ముడుపులు చెల్లించుకున్న భక్తుల ద్వారా హుండీ కానుకల ఆదాయం రూ. 3.37 కోట్లుగా నమోదైంది. అలాగే 23,743 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల ఆకలి తీర్చే అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా 1.83 లక్షల మందికి పైగా అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande