పాకిస్తాన్ ఇస్లామాబాద్ లో భారీ పేలుడు.. 12 మంది మృతి
హైదరాబాద్, 11 నవంబర్ (హి.స.) పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో భారీ బాంబు పేలుడు జరిగింది. ఇస్లామాబాద్లోని కోర్టు ప్రాంగణంలో నిలిపి ఉంచిన కారులో కారులో బాంబు అమర్చారు. మంగళవారం మధ్యాహ్నం ఇది బ్లాస్ట్ అయింది. దీంతో అక్కడిక్కడే 12 మంది దుర్మరణం చె
పాకిస్తాన్లో పేలుడు


హైదరాబాద్, 11 నవంబర్ (హి.స.)

పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో భారీ బాంబు పేలుడు జరిగింది. ఇస్లామాబాద్లోని కోర్టు ప్రాంగణంలో నిలిపి ఉంచిన కారులో కారులో బాంబు అమర్చారు. మంగళవారం మధ్యాహ్నం ఇది బ్లాస్ట్ అయింది. దీంతో అక్కడిక్కడే 12 మంది దుర్మరణం చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు దాటికి చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. ఈ పేలుడు జరిగిన సమయంలో కోర్టు ప్రాంగణంలో భారీ ట్రాఫిక్, పెద్ద సంఖ్యలో జనాలు ఉన్నారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని తదుపరి దర్యాప్తు కోసం చుట్టుపక్కల ప్రాంతంలో ఆంక్షలు విధించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande