ఇందిరమ్మ చీరల పంపిణీ కోసం నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారి: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, 19 నవంబర్ (హి.స.) మహిళల ఉన్నతి.. తెలంగాణ ప్రగతి పేరుతో రాష్ట్రంలోని మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 35 లక్షల చీరలు పంపిణీ చేయబోతు
Cm revanth Reddy


హైదరాబాద్, 19 నవంబర్ (హి.స.)

మహిళల ఉన్నతి.. తెలంగాణ ప్రగతి పేరుతో రాష్ట్రంలోని మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 35 లక్షల చీరలు పంపిణీ చేయబోతున్నట్లు తెలిపారు.

ఇవాళ సెక్రటేరియట్లో కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియకు సంబంధించి ప్రతీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని, నియోజకవర్గాల్లోని అన్ని మండల కేంద్రాల్లో విడతల వారీగా ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో ఇందిరమ్మ చీరల పంపిణీ చేపట్టాలని ఆదేశించారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande