
విశాఖపట్నం, 19 నవంబర్ (హి.స.)
జిల్లా పెందుర్తి దగ్గర ఇవాళ పెను ప్రమాదం తప్పింది. రైల్వే పనులు జరుగుతున్న సమయంలో విద్యుత్ స్తంభం ఒరిగి రైల్వే ఓవర్‌హెడ్ ఎక్విప్‌మెంట్ (OHE) విద్యుత్ వైర్లపై పడిపోయింది. అదే సమయంలో అటుగా వస్తున్న టాటా నగర్ ఎక్స్‌ప్రెస్ రైలు లోకో పైలెట్ అప్రమత్తమై సకాలంలో నిలిపివేయడంతో పెద్ద ముప్పు తప్పింది. ఇక, ఈ ప్రమాదంలో ముగ్గురు రైల్వే ఉద్యోగులకు గాయాలయ్యాయి.
ఇక, సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఘటనపై రైల్వే అధికారులు ఈ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ