భాగ్యనగరంలో.రెండో రోజు ఐటీ అధికారుల సోదాలు
హైదరాబాద్, 19 నవంబర్ ( హిం.స) , :భాగ్యనగరంలో రెండో రోజు ఐటీ అధికారుల సోదాలుకొనసాగుతున్నాయి. పిస్తా హౌస్, షాగౌస్, మైఫిల్‌లో తనిఖీలు కొనసాగుతున్నాయి. సోదాలు జరిపి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. రాజేంద్రనగర్ పిస్తాహౌస్ ఓనర్ నివా
భాగ్యనగరంలో.రెండో రోజు ఐటీ అధికారుల సోదాలు


హైదరాబాద్, 19 నవంబర్ ( హిం.స)

, :భాగ్యనగరంలో రెండో రోజు ఐటీ అధికారుల సోదాలుకొనసాగుతున్నాయి. పిస్తా హౌస్, షాగౌస్, మైఫిల్‌లో తనిఖీలు కొనసాగుతున్నాయి. సోదాలు జరిపి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. రాజేంద్రనగర్ పిస్తాహౌస్ ఓనర్ నివాసంలో నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు. ఇవాళ(బుధవారం) బ్యాంకు ఖాతాలను పరిశీలించి, లాకర్లను ఓపెన్ చేయనున్నారు ఐటీ అధికారులు. షాగౌస్, మైఫిల్‌‌లో కూడా పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. రికార్డ్స్‌లోని ఆదాయం.. అసలు ఆదాయానికి మధ్య వ్యత్యాసాలు ఉండటంతో ఐటీ రైడ్స్ కొనసాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande