ఎన్‌కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్‌
హైదరాబాద్, 19 నవంబర్ (హి.స.) . ‘‘మావోయిస్టుల ఎన్‌కౌంటర్లను తక్షణమే ఆపివేయాలి. ఎన్‌కౌంటర్లపై గురువారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహిస్తున్నాం. మావోయిస్టుల పక్షాన న్యాయ పోరాటం చేస్తాం. హిడ్మా కోరితే ఆశ్రయం ఇచ్చే వాళ్లం. అతన్ని నేనే డీజీపీకి సరెండర్‌
ఎన్‌కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్‌


హైదరాబాద్, 19 నవంబర్ (హి.స.) . ‘‘మావోయిస్టుల ఎన్‌కౌంటర్లను తక్షణమే ఆపివేయాలి. ఎన్‌కౌంటర్లపై గురువారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహిస్తున్నాం. మావోయిస్టుల పక్షాన న్యాయ పోరాటం చేస్తాం. హిడ్మా కోరితే ఆశ్రయం ఇచ్చే వాళ్లం. అతన్ని నేనే డీజీపీకి సరెండర్‌ చేయించే వాడిని. హిడ్మాను చంపి ఎన్‌కౌంటర్‌ అంటున్నారు. ఎన్‌కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ చేశారు.

ఎన్‌కౌంటర్‌ అంటే పరస్పరం కాల్పులు జరపడం. ఏకపక్షంగా కాల్పులు జరపడాన్ని బండి సంజయ్‌ ఎన్‌కౌంటర్‌ అంటున్నారు. మావోయిస్టులతో చర్చించి సమస్యలను తెలుసుకోవాల్సింది పోయి చంపుతున్నారు. 2026 మార్చి కల్లా మావోయిస్టులను అంతం చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రకటించారు. అంతం చేయడానికి ఇదేమైనా యుద్ధమా? కాల్పులు విరమించుకుంటున్నామని ప్రకటించినా చంపుతున్నారు. దండకారణ్యంలో ఖనిజాల కోసమే మావోయిస్టులను చంపుతున్నారు’’ అని కూనంనేని ఆరోపించారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande