
హైదరాబాద్, 19 నవంబర్ (హి.స.)
దేశరాజధాని ఎర్రకోట వద్ద పేలుడు ఘటన, ఉగ్రవాద మాడ్యుల్ విషయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ పై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ విమర్శలు గుప్పించారు. గత ఆరు నెలల్లో స్థానిక కశ్మీరీలలో ఎవరూ ఉగ్రవాద గ్రూపులలో చేరలేదని ఆపరేషన్ సిందూర్, మహదేవ్ సమయంలో అమిత్ షా పార్లమెంట్కు చెప్పారని మరి ఇప్పుడు ఢిల్లీ పేలుడులో పాల్గొన్న ఈ గ్రూప్ ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. ఈ గ్రూప్ను గుర్తించడంలో వైఫల్యానికి ఎవరు బాధ్యత వహిస్తాని నిలదీసారు. ఈ మేరకు తాజాగా ఎక్స్ లో పోస్టు చేసిన ఒవైసీ.. ఎర్రకోట వద్ద ఆత్మహుతికి పాల్పడిన డాక్టర్ ఉమర్ నబీ వీడియోపై కూడా స్పందించారు.
ఇస్లాంలో ఆత్మహుతిని తప్పుగా అర్థం చేసుకున్నారని ఆత్మాహుతి అంటే బలిదానం అని అమరత్వం పొందేందుకు ఇది సరైన పనే అంటూ నబీ రికార్డు చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ వీడియోపై స్పందించిన ఒవైసీ నబీ వ్యాఖ్యలను ఖండించారు. డాక్టర్ ఉమర్ నబీ చర్యలు ముమ్మాటికే ఉగ్రవాదమేనన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు