దేశ సమగ్రత కోసం పాటుపడిన మహిళ ఇందిరాగాంధీ: ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
షాద్నగర్, 19 నవంబర్ (హి.స.) పేదల అభ్యుదయం, దేశ సమగ్రత కోసం పాటుపడిన ఉక్కు మహిళ మాజీ ప్రధాని, భారతరత్న ఇందిరా గాంధీ అని షాద్ నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ అన్నారు. స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా జాతీయ సమైక్యత దినోత్సవాన్ని బుధవారం ఎమ్మె
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్


షాద్నగర్, 19 నవంబర్ (హి.స.)

పేదల అభ్యుదయం, దేశ సమగ్రత

కోసం పాటుపడిన ఉక్కు మహిళ మాజీ ప్రధాని, భారతరత్న ఇందిరా గాంధీ అని షాద్ నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ అన్నారు. స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా జాతీయ సమైక్యత దినోత్సవాన్ని బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ చిత్రపటానికి ఎమ్మెల్యే శంకర్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశసేవకై తన జీవితాన్నే అంకితం చేసిన ఉక్కు మహిళ దేశ ప్రథమ మహిళా ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరా గాంధీ అని అన్నారు. మహనీయురాలి జయంతి సందర్భంగా జాతీయ సమైక్యత దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని ఎమ్మెల్యే తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande