
విజయవాడ:, 4 నవంబర్ (హి.స.)నకిలీ మద్యం కేసు రోజుకో మలుపు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గోవాలో నకిలీ మద్యం కేంద్రాన్ని గుర్తించినట్లు సిట్ అధికారులు తెలిపారు. వైసీపీ హయాంలో జనార్ధన్‍రావుతో కలిసి కేరళకు చెందిన జినేష్ అనే వ్యక్తి గోవాలో కల్తీ లిక్కర్ డంప్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సౌత్ గోవా, నార్త్ గోవా, పనాజీ, మార్గావ్‍లో కల్తీ లిక్కర్ విక్రయాలు జరిపినట్లు చెప్పారు. మరోవైపు నకిలీ మద్యం కేసు దర్యాప్తులో పలువురి పాత్రపై ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ