
తెలంగాణ, 4 నవంబర్ (హి.స.)
ఈరోజు సాయంత్రం నుండి తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ తెలిపింది. నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో గంటకు 41 నుంచి 61 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
జయశంకర్ భూపాలపల్లి, మేడ్చల్, మల్కాజిగిరి, అలాగే హైదరాబాద్, జగిత్యాల, ఖమ్మం, మేడ్చల్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, ములుగు, నారాయణపేట, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్ధిపేట జిల్లాల్లో గంటకు 5 మిల్లీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. గంటకు 40 కిలోమీటర్ల కంటే తక్కువ గాలులు వీస్తాయని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు