టీ20 ప్రపంచకప్‌నకు ఆఫ్ఘ‌నిస్థాన్ జట్టు ప్రకటన.. సీనియ‌ర్ల‌కు పిలుపు
ఢిల్లీ, 31 డిసెంబర్ (హి.స.)భారత్, శ్రీలంక వేదికలుగా 2026 ఫిబ్రవరిలో జరగనున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ కోసం ఆప్ఘ‌నిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఈ జట్టుకు నాయకత్వం వహిం
టీ20 ప్రపంచకప్‌నకు ఆఫ్ఘ‌నిస్థాన్ జట్టు ప్రకటన.. సీనియ‌ర్ల‌కు పిలుపు


ఢిల్లీ, 31 డిసెంబర్ (హి.స.)భారత్, శ్రీలంక వేదికలుగా 2026 ఫిబ్రవరిలో జరగనున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ కోసం ఆప్ఘ‌నిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఈ జట్టుకు నాయకత్వం వహించనున్నారు. అనుభవజ్ఞులైన ఆటగాళ్ల చేరికతో జట్టును మరింత బలోపేతం చేశారు.

ప్రధానంగా సీనియర్ ఆల్ రౌండర్ గుల్బాదిన్ నైబ్ తిరిగి జట్టులో స్థానం సంపాదించుకోగా, భుజం గాయం కారణంగా కొంతకాలం ఆటకు దూరంగా ఉన్న ఫాస్ట్ బౌలర్ నవీన్ ఉల్ హక్ పూర్తిగా కోలుకుని జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. స్పిన్ విభాగంలో ముజీబ్ ఉర్ రెహ్మాన్ తిరిగి రావడంతో ఇటీవల ఆకట్టుకున్న యువ స్పిన్నర్ ఏఎం ఘజన్‌ఫర్‌ను రిజర్వ్ జాబితాలో చేర్చాల్సి వచ్చింది. వికెట్ కీపర్ బ్యాటర్ మొహమ్మద్ ఇషాక్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ షాహిదుల్లా కమల్ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు.

ఆఫ్ఘ‌నిస్థాన్ జట్టు:

రషీద్ ఖాన్ (కెప్టెన్), ఇబ్రహీం జద్రాన్ (వైస్ కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), మొహమ్మద్ ఇషాక్ (వికెట్ కీపర్), సెదికుల్లా అటల్, దర్విష్ రసూలీ, షాహిదుల్లా కమల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బాదిన్ నైబ్, మొహమ్మద్ నబీ, నూర్ అహ్మద్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నవీన్ ఉల్ హక్, ఫజల్ హక్ ఫరూఖీ, అబ్దుల్లా అహ్మద్‌జాయ్.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande