న్యూజిలాండ్కు మరో భారీ ఎదురు దెబ్బ!
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో ఓడిన న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ ఇష్ సోధీకి గాయమైంది.
Sports


హైదరాబాద్, 16 మార్చి (హి.స.)దక్షిణాఫ్రికాతో న్యూజిలాండ్(South Africa Vs New Zeland) ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో సౌతాఫ్రికా కివీస్పై విజయం సాధించింది. ఈ ఓటమిలో ఉన్న న్యూజిలాండ్ జట్టుకు మరో భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ ఇష్ సోధీ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు.

ప్రొటీస్తో జరిగిన తొలి టీ20 మ్యాచ్కు ముందు నెట్స్లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో సోధీ(Ish Sodhi) బొటన వేలుకు గాయమైంది. స్కానింగ్ చేయగా.. బొటనవేలు ఎముక విరిగినట్లు తేలింది. నాలుగు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సోధీకి వైద్యులు సూచించారు. ఈ క్రమంలోనే సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్ కు ఈ రైటార్మ్ స్పిన్నర్ దూరమయ్యాడు. తొలుత చిన్నపాటి గాయమని అందరూ భావించారు. అయితే స్కానింగ్ లో వేలు విరిగినట్లు రావడంతో ఈ సిరీస్ మొత్తానికి దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మిగిలిన రెండు టీ20 మ్యాచులకు కూడా సోధీ దూరం కానున్నాడు.

న్యూజిలాండ్ బౌలింగ్ విభాగంలో సోధీ కీలక పాత్ర పోషిస్తాడనే విషయం అందరికీ తెలిసిందే. తనదైన స్పిన్తో ప్రత్యర్థులను టెన్షన్ పెడుతుంటాడు. మరోవైపు సౌతాఫ్రికాతో జరిగే రెండో టీ20కి లాకీ ఫెర్గూసన్ కివీస్ జట్టులో చేరనున్నాడు. టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్లో భారత్ చేతిలో ఓడి రన్నరప్ గా నిలిచిన న్యూజిలాండ్ .. స్వదేశంలో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడుతోంది. ఇదిలా ఉంటే.. కివీస్ తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ ద్వారా నలుగురు సౌతాఫ్రికా ఆటగాళ్లు అరంగేట్రం చేయడం విశేషం. ఇరు జట్ల మధ్య హామిల్టన్ వేదికగా రేపు(మంగళవారం) రెండో టీ20 జరగనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande