తుని.తీవ్ర ఉద్రిక్త పరిస్థితి.నెలకొంది
విజయవాడ, 18 ఫిబ్రవరి (హి.స.) కాకినాడ,: తునిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వేళ సీన్ వైసీపీ వర్సెస్ టీడీపీగా మారింది. ఎన్నికలు జరుగకుండా చేస్తున్నారంటూ వైసీపీపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ వ
తుని.తీవ్ర ఉద్రిక్త పరిస్థితి.నెలకొంది


విజయవాడ, 18 ఫిబ్రవరి (హి.స.)

కాకినాడ,: తునిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వేళ సీన్ వైసీపీ వర్సెస్ టీడీపీగా మారింది. ఎన్నికలు జరుగకుండా చేస్తున్నారంటూ వైసీపీపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక కోసం ఈరోజు (మంగళవారం) ఉదయం టీడీపీ కౌన్సిలర్లు సమావేశానికి వచ్చారు. అయితే తమ కౌన్సిలర్లను రాకుండా వైసీపీ అడ్డుకోవడంపై టీడీపీ నిరసనకు దిగింది. ఎన్నిక జరగకుండా వైసీపీ చేస్తోందంటూ మండిపడుతున్నారు టీడీపీ కౌన్సిలర్లు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను టీడీపీ కార్యకర్తలు నెట్టివేశారు. వైసీపీ కౌన్సిలర్లను దాచిన ప్రాంతానికి వెళ్ళే ప్రయత్నం చేశారు. కొందరు వైసీపీ కౌన్సిలర్లు ఎన్నిక కోసం వెళ్లడానికి ప్రయత్నించగా.. టీడీపీ నేతలు పక్కనే ఉండడంతో మళ్లీ కౌన్సిలర్లను దాచేసింది వైసీపీ.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande