
అమరావతి, 02 మార్చి (హి.స.) పాల్గుణ పౌర్ణమి రోజు కేతుగ్రస్త పాక్షిక చంద్ర గ్రహణం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మార్చి 3వ తేదీ మంగళవారం ఉదయం 10.00 గంటలకు దుర్గమ్మ ప్రధాన ఆలయంతోపాటు ఉపాలయాల కవాట బంధనం చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే చంద్రగ్రహణం కారణంగా.. పౌర్ణమి వేళ ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ రద్దు చేసినట్లు తెలిపారు. అదే విధంగా శాంతి కళ్యాణం, చండీ హోమం, సాయంత్రం పంచ హారతులతోపాటు పల్లకీ సేవ సహా ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు వివరించారు.పాల్గుణ పౌర్ణమి రోజు కేతుగ్రస్త పాక్షిక చంద్ర గ్రహణం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మార్చి 3వ తేదీ మంగళవారం ఉదయం 10.00 గంటలకు దుర్గమ్మ ప్రధాన ఆలయంతోపాటు ఉపాలయాల కవాట బంధనం చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే చంద్రగ్రహణం కారణంగా.. పౌర్ణమి వేళ ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ రద్దు చేసినట్లు తెలిపారు. అదే విధంగా శాంతి కళ్యాణం, చండీ హోమం, సాయంత్రం పంచ హారతులతోపాటు పల్లకీ సేవ సహా ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ