గురుగ్రామ్, 12 మార్చి (హి.స.)
కాంగ్రెస్ పార్టీకి మరోసారి ఘోర పరాజయం ఎదురైంది. హర్యానా స్థానిక ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది. అధికార బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత, హర్యానాలో ప్రభావంతమైన నేతగా చెప్పబడుతున్న భూపిందర్ హుడాకు కంచుకోటగా ఉన్న గురుగ్రామ్, రోహ్‌తక్‌తో సహా 10 మేయర్ స్థానాల్లో 09 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. స్వతంత్ర అభ్యర్థి-బీజేపీ తిరుగుబాటు నేత డాక్టర్ ఇందర్‌జిత్ యాదవ్ 10వ స్థానమైన మానేసర్‌ని గెలుచుకున్నారు.
గతేడాది జరిగిన హర్యానా ఎన్నికల పరాభవం తర్వాత, మరోసారి కాంగ్రెస్‌కి దారుణమైన ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. కాంగ్రెస్‌కి గట్టి పట్టున్న రోహ్‌తక్ మేయర్ సీటు కోసం బీజేపీ, కాంగ్రెస్, ఆప్, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్, ఒక స్వతంత్ర అభ్యర్థి పోటీ పడ్డారు. బీజేపీకి చెందిన రామ్ అవతార్ తిరుగులేని విజేతగా నిలిచారు. ఆయనకు లక్షకు పైగా ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి సూరజ్మల్ కిలోయ్ 45,000 కంటే ఎక్కువ ఓట్లతో రెండోస్థానంలో నిలిచారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు