కశ్మీర్‌లో రెండు సంస్థలపై నిషేధం
దిల్లీ: , 12 మార్చి (హి.స.)జమ్మూ కశ్మీర్‌లో మీర్వాయిజ్‌ ఉమర్‌ ఫారూఖ్‌ నాయకత్వంలోని ఆవామీ యాక్షన్‌ కమిటీ(ఏసీసీ), షియా నేత మస్రూర్‌ అబ్బాస్‌ అన్సారీ నేతృత్వంలోని జమ్మూ కశ్మీర్‌ ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ (జేకేఐఎం) సంస్థలను కేంద్రప్రభుత్వం మంగళవారం ఐదేళ్ల
కశ్మీర్‌లో రెండు సంస్థలపై నిషేధం


దిల్లీ: , 12 మార్చి (హి.స.)జమ్మూ కశ్మీర్‌లో మీర్వాయిజ్‌ ఉమర్‌ ఫారూఖ్‌ నాయకత్వంలోని ఆవామీ యాక్షన్‌ కమిటీ(ఏసీసీ), షియా నేత మస్రూర్‌ అబ్బాస్‌ అన్సారీ నేతృత్వంలోని జమ్మూ కశ్మీర్‌ ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ (జేకేఐఎం) సంస్థలను కేంద్రప్రభుత్వం మంగళవారం ఐదేళ్లపాటు నిషేధించింది. ఈ సంస్థలు జాతి వ్యతిరేక చర్యలకు పాల్పడటంతోపాటు తీవ్రవాదానికి మద్దతు తెలపడం, వేర్పాటు వాదాన్ని ప్రోత్సహించడం వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని కేంద్ర హోంశాఖ పేర్కొంది. శ్రీనగర్‌ జామా మసీదుకు ప్రధాన మతాచార్యుడైన మీర్వాయిజ్‌ ఉమర్‌ ఫారూఖ్‌ హురియత్‌ కాన్ఫరెన్స్‌కు నేతృత్వం వహిస్తున్నాడు

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande