దిల్లీ: , 12 మార్చి (హి.స.)నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం కలుగుతోందంటూ మంగళవారం ఉదయం రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యులు నిరసనకు దిగారు. శూన్య గంట తర్వాత దీనిపైనే చర్చ చేపట్టాలని డిమాండు చేళారు. వెల్‌లోని వెళ్లి నినాదాలు చేశారు. దీంతో సభ 40 నిమిషాలపాటు వాయిదా పడింది. శూన్య గంటలో ఈ అంశాన్ని డీఎంకే ఎంపీ గిరిరాజన్ ప్రస్తావించారు. కుటుంబ నియంత్రణను సమర్థంగా అమలు చేసిన కేరళ, తమిళనాడు, పంజాబ్ వంటి రాష్ట్రాలు డీలిమిటేషన్‌వల్ల నష్టపోతాయని, సరిగా అమలు చేయని ఉత్తర్ ప్రదేశ్, బిహార్, రాజస్థాన్ వంటివి లాభపడతాయని పేర్కొన్నారు. మరోవైపు సభలో డూప్లికేట్ ఓటరు ఐడీ కార్డుల జారీలో ఎన్నికల సంఘం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపిస్తూ చర్యలకు కాంగ్రెస్, తృణమూల్, బిజూ జనతాదళ్, శివసేన (ఉద్ధవ్) సభ్యులు పట్టుబట్టా
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు