ముంబయి: 12 మార్చి (హి.స.)దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాల నడుమ మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో సూచీలు తొలుత లాభాల్లో ట్రేడింగ్ మొదలుపెట్టినప్పటికీ కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 9:30 గంటలకు సెన్సెక్స్ (Sensex)83 పాయింట్లు నష్టంతో 74,018 వద్ద.. నిఫ్టీ (Nifty) 41 పాయింట్లు కుంగి 22,456 వద్ద ఉన్నాయి.
సెన్సెక్స్ 30 సూచీలో టాటా మోటార్స్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, జొమాటో, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎస్‌బీఐ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు