యూరప్ లోని నార్త్ మేసిడోనియా నైట్ క్లబ్ లో అగ్ని ప్రమాదం 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు
విజయవాడ, 16 మార్చి (హి.స.): యూరప్‌లోని నార్త్‌ మెసిడోనియాలో నైట్‌ క్లబ్‌లో ( భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 50 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 100మందికిపైగా గాయపడినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గంటలు గడిచినా మంటలు అదుపులోకి
యూరప్ లోని నార్త్ మేసిడోనియా నైట్ క్లబ్ లో అగ్ని ప్రమాదం 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు


విజయవాడ, 16 మార్చి (హి.స.): యూరప్‌లోని నార్త్‌ మెసిడోనియాలో నైట్‌ క్లబ్‌లో ( భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 50 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 100మందికిపైగా గాయపడినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గంటలు గడిచినా మంటలు అదుపులోకి రాలేదని సమాచారం.

నార్త్‌ మెసిడోనియా రాజధాని స్కోప్జేకు సుమారు 100కి.మీ దూరంలో కొకాని అనే పట్టణంలోని పల్స్‌ క్లబ్‌లో శనివారం రాత్రి జరిగిన కాన్సర్ట్‌లో దాదాపు 1500 మంది పాల్గొన్నారు. అయితే, ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఈవెంట్‌లో మండే స్వభావం) కలిగిన వస్తువుల వాడటంతోనే సీలింగ్‌కు నిప్పు అంటుకొందని ప్రాథమికంగా నిర్ధరించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande