యాదాద్రి భువనగిరి, 20 మార్చి (హి.స.) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్న కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు వెళ్తున్న కేటీఆర్కు.. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని బస్టాండ్ వద్ద మునుగోడు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.పుష్పగుచ్చాలు అందించి శాలువలతో సత్కరించారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్