విశాఖపట్నం, 30 మార్చి (హి.స.)
ఇవాళ విశాఖ వేదికగా ఐపీఎల్ మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఢిల్లీ జట్టును ఓడించి ట్రోర్నిలో రెండో విక్టరీని సాధించాలని కమిన్స్ సేన భావిస్తుంది.
హోం గ్రౌండ్ ఉప్పల్ వేదికగా తన తొలి మ్యాచ్‌లో అద్భుత విజయాంతో అదరగొట్టిన ఎస్ఆర్‌హెచ్.. అ తర్వాత లక్నోతో జరిగినా మ్యాచ్‌లో అపజయం మూట్టకట్టుకుంది.
నేడు ఢిల్లీతో జరిగే విజయం సాధించాలని హైదారాబాద్ టీం భావిస్తుంది. అయితే బ్యాటింగ్ పరంగా దృఢంగా ఉన్న హైదరాబాద్..బౌలింగ్‌లో కాస్త వెనుకబడిందనే చెప్పుకోవాలి. రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో హైదరాబాద్ బౌలర్లు పర్వాలేదు అనిపించుకున్నా.. లక్నోతో జరిగినా మ్యాచ్‌లో బౌలర్లు అనుకున్నంతమేర రాణించలేదు. 191 భారీ లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేక చేతులెత్తేశారు. పేపర్‌పై షమీ, హర్షల్ పటేల్, ఆడమ్ జంపా, కమిన్స్ వంటి స్టార్ బౌలర్లతో హైదరాబాద్ బలంగానే ఉన్నా.. ప్రదర్శన మాత్రం ఆ స్థాయిలో లేదు. బౌలింగ్‌పై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఢిల్లీ వంటి బలమైన బ్యాటింగ్ దళం ఉన్న జట్టును ఎదుర్కోవడం హైదరాబాద్‌కు సవాల్‌తో కూడుకున్నది. లక్నోపై విజయంతో డీసీ ఆత్మవిశ్వాసంతో ఉన్నది. వైజాగ్ హోం గ్రౌండ్ కావడం ఆ జట్టుకు మరింత బలం కానుంది. స్టబ్స్, అశుతోష్ శర్మ మంచి ఫామ్‌లో ఉన్నారు. జేక్ ఫ్రేజర్ గుర్క్, డుప్లెసిస్, అభిషేక్ పొరెల్ కూడా ప్రమాదకరమే. కాబట్టి, బౌలర్లు రాణించడంపైనే హైదరాబాద్ విజయం ఆధారపడి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి