ఐపీఎల్ లో నేడు లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య పోరు..
లక్నో, 1 ఏప్రిల్ (హి.స.) ఐపీఎల్ 2025లో భాగంగా నేడు లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఏకానా క్రికెట్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇరు జట్లలో హార్డ్
ఐపీఎల్


లక్నో, 1 ఏప్రిల్ (హి.స.)

ఐపీఎల్ 2025లో భాగంగా నేడు లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఏకానా క్రికెట్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇరు జట్లలో హార్డ్ హిట్టర్లు ఉండడంతో మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది. ఈ సీజన్ మొదటి మ్యాచ్లో గెలిచిన పంజాబ్.. మరో విజయంపై కన్నేసింది. మరోవైపు ఆడిన రెండు మ్యాచ్లో ఓ దాంట్లో ఓడి, మరోదాంట్లో విజయం సాధించిన లక్నో.. పంజాబ్పై గెలవాలని చూస్తోంది.

కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంతో పంజాబ్ కింగ్స్ టీమ్ పూర్తిగా మారిపోయింది. ఐపీఎల్ 2025లో ఆడిన మొదటి మ్యాచ్లో గుజరాత్పై గెలుపొందింది.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande