ప్రస్తువ.వేసవిలో ఎప్రిల్ జూన్ మధ్య .ఎండలు.సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని ఐ ఏం డీ అంచనా
న్యూఢిల్లీ 1 ఏప్రిల్ (హి.స.)ప్రస్తుత వేసవిలో ఏప్రిల్‌-జూన్‌ మధ్య ఎండలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేస్తోంది. మధ్య, తూర్పు ప్రాంతాల్లో, వాయవ్య రాష్ట్రాల్లో ఎక్కువరోజులు వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఎక్కువ ప్
ప్రస్తువ.వేసవిలో ఎప్రిల్ జూన్ మధ్య .ఎండలు.సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని ఐ ఏం డీ అంచనా


న్యూఢిల్లీ 1 ఏప్రిల్ (హి.స.)ప్రస్తుత వేసవిలో ఏప్రిల్‌-జూన్‌ మధ్య ఎండలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేస్తోంది. మధ్య, తూర్పు ప్రాంతాల్లో, వాయవ్య రాష్ట్రాల్లో ఎక్కువరోజులు వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఎక్కువ ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి మించి నమోదవుతాయని, కనిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా పలుచోట్ల సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని ఐఎండీ అధిపతి మృత్యుంజయ్‌ మహాపాత్ర సోమవారం ఆన్‌లైన్‌లో విలేకరుల సమావేశంలో తెలిపారు. ‘‘రాబోయే మూడు నెలలపాటు అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే రెండు నుంచి నాలుగు రోజులు ఎక్కువగా వడగాలులు వీస్తాయి.

మామూలుగానైతే ఈ మూడు నెలల్లో నాలుగు నుంచి ఏడురోజుల వరకు వడగాలులు నమోదవుతుంటాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్, హరియాణా, బిహార్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో సాధారణం కంటే ఎక్కువగా వడగాలుల రోజులు కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏప్రిల్‌లో దేశంలో చాలా ప్రాంతాల్లో ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి’’ అని వివరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande