విదేశీ విద్యార్ధులపై అమెరికా ఏ ఐ నిఘా
విజయవాడ, 2 ఏప్రిల్ (హి.స.): క్యాంపస్‌ ఆందోళనల్లో క్రియాశీలంగా వ్యవహరించిన అమెరికాలోని (USA) విదేశీ విద్యార్థులకు అక్కడి విదేశాంగశాఖ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. కేవలం ఆందోళనల్లో పాల్గొన్న వారినే కాకుండా అక్కడి దృశ్యాలను, జాతి వ్యతిరేక సందేశ
విదేశీ విద్యార్ధులపై అమెరికా ఏ ఐ నిఘా


విజయవాడ, 2 ఏప్రిల్ (హి.స.): క్యాంపస్‌ ఆందోళనల్లో క్రియాశీలంగా వ్యవహరించిన అమెరికాలోని (USA) విదేశీ విద్యార్థులకు అక్కడి విదేశాంగశాఖ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. కేవలం ఆందోళనల్లో పాల్గొన్న వారినే కాకుండా అక్కడి దృశ్యాలను, జాతి వ్యతిరేక సందేశాలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసిన వారిని స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లిపోవాలంటూ ఈమెయిల్స్‌ పంపినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఈనేపథ్యంలో ఓ కీలకమైన విషయం వెలుగులోకి వచ్చింది. హమాస్‌ అనుకూల ఉగ్రవాద గ్రూపులకు మద్దతిస్తున్న విదేశీ విద్యార్థులను గుర్తించడానికి.. వారిపై నిఘా పెట్టడానికి అమెరికా ప్రభుత్వం ఏఐ (AI) సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఉగ్రవాద అనుకూల పోస్ట్‌లు, స్టోరీలకు ఇన్‌స్టాలో లైక్‌ కొట్టినా దొరకబుచ్చుకునేలా ట్రంప్‌ యంత్రాంగం సాంకేతికతను వినియోగిస్తున్నట్లు పేర్కొన్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande