చెన్నై, 3 ఏప్రిల్ (హి.స.)
సీపీఎం పతాకాన్ని పార్టీ సెంట్రల్ కంట్రోల్ కమిటీ ఛైర్మన్ ఎ.కె.పద్మనాభన్‌కు అందిస్తున్న వాసుకి, చిత్రంలో కేరళ సీఎం పినరయి విజయన్, పార్టీ అగ్రనేతలు ప్రకాశ్ కారాట్, బృందా కారాట్, మాణిక్ సర్కార్ తదితరులు
. భాజపా-ఆర్‌ఎస్‌ఎస్ శక్తులు రాజ్యాంగ విరుద్ధ, ప్రజా వ్యతిరేక కార్యకలాపాల దిశగా వెళుతున్నాయని.. వాటిని ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులు పోరాటాలకు సిద్ధంగా ఉండాలని సీపీఎం సీనియర్ నేత, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ పిలుపునిచ్చారు. తమిళనాడులోని మదురై కేంద్రంగా ఈనెల 6 వరకు జరగనున్న సీపీఎం 24వ అఖిల భారత మహాసభ బుధవారం ప్రారంభమైంది. ఇందులో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. పోరాటాలను ఎలా విస్తృతపరచాలి, దళితులు, గిరిజనులు, మహిళలు, మైనారిటీల హక్కులను ఎలా రక్షించాలనే విషయమై మహాసభలో కీలక తీర్మానాలు వెలువడనున్నాయన్నారు. మోదీ ప్రభుత్వంలో ధరల పెరుగుదలతో పాటు అవినీతి పెరిగిందని విమర్శించారు. మైనారిటీలను క్రమంగా రెండోశ్రేణి పౌరులుగా తగ్గించారని ఆరోపించారు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడయ్యాక అమెరికా సామ్రాజ్యవాదం మరింత తీవ్రమవుతోందని, రాబోయే రోజుల్లో అల్లకల్లోల పరిస్థితులు రాబోతున్నాయని పేర్కొన్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు