ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్కు తప్పిన ప్రమాదం..
న్యూఢిల్లీ, 3 ఏప్రిల్ (హి.స.) ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్కు ప్రమాదం తప్పింది. ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఫొటోలకు పోజులిచ్చేందుకు ఉత్సాహం చూపారు. ఇందులో భాగంగా నిర్వాహకులతో కలిసి ఫొటోలు దిగేందుకు స్టేజ్ చివరి నుంచి రావడంతో ఒక్కసారిగా అమాంత
ప్రధాని ఆస్ట్రేలియా


న్యూఢిల్లీ, 3 ఏప్రిల్ (హి.స.)

ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్కు ప్రమాదం తప్పింది. ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఫొటోలకు పోజులిచ్చేందుకు ఉత్సాహం చూపారు. ఇందులో భాగంగా నిర్వాహకులతో కలిసి ఫొటోలు దిగేందుకు స్టేజ్ చివరి నుంచి రావడంతో ఒక్కసారిగా అమాంతంగా కిందపడిపోయారు. వెంటనే వేదికపై ఉన్న వారంతా స్పందించి వెంటనే పైకి లేపారు.

గురువారం న్యూ సౌత్ వేల్స్లో జరిగిన ఒక ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మే నెలలో జరగనున్న జాతీయ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రసంగం అనంతరం వేదికపై ఉన్నవారితో ఫొటోలు దిగేందుకు వెనక్కి వెళ్లగా సడన్గా కిందపడిపోయారు. వెంటనే సహచరులు పైకి లేపారు. అనంతరం నవ్వుతూ క్షేమంగా ఉన్నానంటూ చేతులు ఊపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande