న్యూఢిల్లీ, 3 ఏప్రిల్ (హి.స.)
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పీపీఎఫ్ ఖాతాలో నామినీ పేరును అప్ డేట్ చేయడానికి లేదా జోడించడానికి ఇకపై ఎటువంటి ఫీజు ఉండదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది.
PPF ఖాతాలలో నామినీ వివరాలను సవరించడం కోసం ఆర్థిక సంస్థలు ఛార్జీలు విధిస్తున్నాయని ఇటీవల తమ దృష్టికి వచ్చిందని ఆర్థిక మంత్రి తన పోస్ట్లో పేర్కొన్నారు. “ప్రభుత్వ పొదుపు ప్రమోషన్ జనరల్ రూల్స్, 2018లో ఏప్రిల్ 2, 2025 నాటి గెజిట్ నోటిఫికేషన్ ద్వారా అవసరమైన మార్పులు చేయబడ్డాయన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..