దిల్లీ: , 2 ఏప్రిల్ (హి.స.)కేంద్ర ప్రభుత్వం బుధవారం లోక్‌సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లును తీసుకువచ్చింది. కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు బిల్లు ప్రవేశపెట్టిన అనంతరం సభలో ప్రసంగించారు. ఈ బిల్లుపై అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకున్నామని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ బిల్లును తీసుకురాకపోతే.. పార్లమెంట్ భూమిని కూడా వక్ఫ్ ఆస్తిగా చెబుతారని అన్నారు. (Waqf Amendment Bill).
‘‘బిల్లు గురించి విపక్షాలు అసత్య ప్రచారం చేశాయి. అందులోని అంశాలను లేవనెత్తి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. 1954లో తొలిసారి వక్ఫ్ చట్టం అమల్లోకి వచ్చింది. అది అప్రజాస్వామికం అని ఆనాడు ఎవరూ చెప్పలేదు’’ అని రిజిజు విపక్షాలను దుయ్యబట్టారు. మరోవైపు విపక్షాలు దీనిని (Waqf Amendment Bill) వ్యతిరేకిస్తున్నాయి
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు