మధ్యప్రదేశ్లోని పుణ్య క్షేత్రాల్లో నేటి నుండి మద్యం నిషేధం అమలు..
గోపాల్ ఎంపీ, 1 ఏప్రిల్ (హి.స.) మధ్యప్రదేశ్లోని పుణ్య క్షేత్రాల్లో మద్యం నిషేధం అమలులోకి తెచ్చారు. మంగళవారం నుంచి పలు పట్టణాల్లో లిక్కర్పై బ్యాన్ విధించారు. జ్యోతిర్లింగ క్షేత్రాలైన ఉజ్జయిని, ఓంకారేశ్వర్తోపాటు మాహేశ్వర్, మైహర్ పట్టణాల్లో మద్య నిషేధాన్
మధ్యప్రదేశ్


గోపాల్ ఎంపీ, 1 ఏప్రిల్ (హి.స.) మధ్యప్రదేశ్లోని పుణ్య క్షేత్రాల్లో మద్యం నిషేధం అమలులోకి తెచ్చారు. మంగళవారం నుంచి పలు పట్టణాల్లో లిక్కర్పై బ్యాన్ విధించారు. జ్యోతిర్లింగ క్షేత్రాలైన ఉజ్జయిని, ఓంకారేశ్వర్తోపాటు మాహేశ్వర్, మైహర్ పట్టణాల్లో మద్య నిషేధాన్ని అమలు చేస్తున్నారు. వీటితో పాటు మొత్తం 19 మతపరమైన పట్టణాలు, ప్రాంతాల్లో, గ్రామ పంచాయతీల్లో బ్యాన్ ఉంటుంది. తమ ప్రభుత్వ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నదని సీఎం మోహన్ యాదవ్ తెలిపారు.

జనవరి 24వ తేదీన సీఎం మోహన్ యాదవ్.. లిక్కర్ బ్యాన్ నిర్ణయాన్ని ప్రకటించారు. దానికి క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది. తాజా నిర్ణయం ప్రకారం లిక్కర్ షాపులు, బార్లను మూసివేయనున్నారు.

రాష్ట్రంలోని 19 అర్బన్, రూరల్ ప్రాంతాలు పూర్తిగా పవిత్రమైనవని ఇటీవల బీజేపీ సర్కారు ప్రకటించింది.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande