మొహాలి, పంజాబ్, 1 ఏప్రిల్ (హి.స.) పంజాబ్కు చెందిన పాస్టర్,సోషల్మీడియా ఇన్ఫ్లుయెన్సర్ బాజిందర్ సింగుకు అత్యాచారం కేసులో జీవిత ఖైదు శిక్ష పడింది. 2018లో ఓ యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు గానూ అతడిని దోషిగా తేల్చిన న్యాయస్థానం.. తాజాగా శిక్షను ఫైనల్ చేసింది. బాజిందర్ సింగ్ క్కు జీవిత ఖైదు విధిస్తూ ఈరోజు తీర్పు వెల్లడించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ఐదుగురిని మొహలీ కోర్టు నిర్దోషులుగా తేల్చింది. అయితే, బాజిందర్ సింగ్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని జిరాక్పుర్కు చెందిన ఓ మహిళ 2018లో పోలీసులకు కంప్లైంట్ చేసింది.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..