నేరేడు పండు తింటే గొప్ప లాభాలు..
కర్నూలు, 1 ఏప్రిల్ (హి.స.) నేరేడు పండు పోషకాలు అధికంగా ఉండే పండు. ఇది రుచికరమైనదే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. నేరేడు పండును మితంగా తీసుకుంటే శరీరానికి అనేక రకాలుగా మేలు కలుగుతుంది.నేరేడు శక్తి నందించి.. ఆరోగ్యానికి మేలు చేస్తుంది. క
నేరేడు పండు తింటే   గొప్ప లాభాలు..


కర్నూలు, 1 ఏప్రిల్ (హి.స.)

నేరేడు పండు పోషకాలు అధికంగా ఉండే పండు. ఇది రుచికరమైనదే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. నేరేడు పండును మితంగా తీసుకుంటే శరీరానికి అనేక రకాలుగా మేలు కలుగుతుంది.నేరేడు శక్తి నందించి.. ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కొన్నిరకాల రోగాలనూ నియంత్రించే శక్తి నేరేడు సొంతం. ఒక్క పండే కాదు.. ఆకులు.. బెరడు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఆరోగ్య ఫల ప్రధాయిని నేరేడు పండు తినడం వలన కలిగే లాభాల గురించి తెలుసుకుందాం..

చాలా కాలంగా కడుపులో పేరుకుపోయిన మలినాలను బయటకు పోవటానికి నేరేడు పండ్లను తినటం మంచిది.

పేగుల్లో చుట్టుకుపోయిన వెంట్రుకలకు కోసేసి బయటికి పంపే శక్తి నేరేడు పళ్ళకు ఉంది.

నేరేడు పండ్లు శరీరానికి చలవ చేస్తాయి.

దీర్ఘకాల వ్యాదులకు నివారణకు నేరేడు పండ్లను తినటం వలన రోగ నిరోదకశక్తి పెరుగుతుంది. వ్యాధి తీవ్రతను తగ్గిస్తుంది.

మూత్ర సంబంధ సమస్యల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

నీరసం, నిస్సత్తువ ఉన్న వారు నేరేడు పండును తింటే తక్షణ శక్తి వస్తుంది.

వెన్నునొప్పి, నడుం నొప్పి, మోకాళ్ల నొప్పులు, నయం అవుతాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande